1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"లక్"లో శృతిహాసన్ పాట!

వినోదం వెండితెర గుసగుసలు పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ బాలీవుడ్ లక్ పాట ఇమ్రాన్ ఖాన్
పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. సోహమ్ షా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. హీరోయిన్‌గా తన టాలెంట్‌ను "లక్" ద్వారా నిరూపించుకోవాలనుకుంటున్న శృతికి మరో ఛాన్స్ దొరికింది. అదేమిటంటే...? తన మొదటి బాలీవుడ్ సినిమాలోనే శృతి ఓ పాట పాడనుందట.

తండ్రికి తగ్గ కూతురుగా చిన్న నాటి నుంచే కళలంటే ఆసక్తి కనబరచే శృతి హాసన్, తన ఆరవ ఏటనే కమల్ హాసన్ "దేవర్ మగన్" చిత్రంలో ఓ పాటను ఆలపించింది. ఇకపోతే... ప్రితం సంగీతం సమకూర్చుతున్న "లక్" సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

కమల్ కుటుంబానికి సన్నిహితుడైన ఇమ్రాన్ ఖాన్... శృతిని తన చిత్రంలో హీరోయిన్‌గా నటింపజేయాలని దర్శకుడు సోహమ్‌కు సిఫార్సు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌కు ఇమ్రాన్ ఖాన్ బంధువు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా... తమిళంలో మాధవన్ సరసన శృతి హాసన్ నటించాలనుకున్న చిత్రం రద్దైన సంగతి తెలిసిందే.