1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కామ్నా జఠ్మలానీకి అవకాశాల వెల్లువ..!

వినోదం వెండితెర గుసగుసలు ప్రేమికులు కామ్నా జఠ్మలానీ టాలీవుడ్ అవకాశాల వెల్లువ గోపిచంద్ రణం
"ప్రేమికులు" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కామ్నా జఠ్మలానీ. ఈ అమ్మడుకు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. "గోపిచంద్" సరసన "రణం" చిత్రం ద్వారా తన అందాలను ఆరబోసిన ఈ ముద్దుగుమ్మను బి. జయ టాలీవుడ్‌కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా "టాస్" అనే అద్భుతమైన ప్రేమకథా చిత్రంలో అందాల హీరో రాజా సరసన నటిస్తోంది. అంతేకాకుండా రాజా హీరోగా నటిస్తోన్న "అందమైన అబద్ధం" అనే మరో సినిమాలోనూ కామ్నా హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.

తాజా వివరాల ప్రకారం... కామ్నా చేతిలో భారీ సినిమా ప్రాజెక్టులున్నట్లు సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇందులో భాగంగా, మోహన్ వడపట్ల నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న కొత్త సినిమాలోనూ కామ్నా నటించనుందని తెలిసింది.

ఇకపోతే... భూమిక ప్రధాన పాత్రలో నటించిన "మల్లెపువ్వు", పోసాని కృష్ణ మురళి విభిన్న పాత్రలో కన్పించనున్న "మెంటల్ కృష్ణ" వంటి సినిమాలకు మోహన్ వడపట్ల నిర్మాత బాధ్యతలు చేపట్టారు.