అర్థగంట డ్యాన్స్‌కు రూ.కోటి డిమాండ్!
అర్థగంట ఫెర్‌ఫార్మెన్స్‌కే బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందట. ఇదేదో తమాషాకు చెప్పలేదండీ బాబూ... జె.డబ్ల్యూ మారియోట్ అనే న్యూ ఇయర్ ప్రోగ్రామ్‌లో కత్రీనా కైఫ్ తన అందాలను ఆరబోస్తూ డ్యాన్స్ చేయడానికి ఇంత మొత్తాన్ని డిమాండ్ చేసిందని ముంబై సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఈ ప్రొగ్రామ్‌లో పాలు పంచుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో మల్లికా శెరావత్ 50లక్షలు, బిపాసా బసు 90 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అర్ధగంట పాటు మాత్రమే జరిగే ఈ కార్యక్రమంలో మల్లికా, బిపాస, కత్రీనాలు తమ డ్యాన్స్ ఫెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నారని తెలిసింది. ఇప్పటికే కత్రీనా నటించిన "నమస్తే లండన్", "వెల్‌కమ్", "రేస్" వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ సాధించడంతో... కత్రీనాకు రేటు పెరిగిపోతుందని బాలీవుడ్ వర్గాల బోగట్టా.
డిసెంబర్ 31వ తేదీన రాత్రి జరిగే ఈ ప్రొగ్రామ్‌కు బాలీవుడ్ భామలు నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని తెలిసింది. ఈ ప్రొగ్రామ్‌కోసం కత్రీనా కైఫ్ ఎంచక్కా ముస్తాబవుతున్నట్లు సమాచారం. అత్యద్భుతంగా ప్రదర్శన కోసం కత్రీనాకు డిజైనర్ రాకీ కాస్ట్యూమ్స్ సిద్ధం చేస్తుండగా, కొరియోగ్రాఫింగ్ పనులను బోస్కో-కాసెర్ చూసుకుంటున్నారు.
ఇకపోతే... తాజాగా కత్రీనా ఖబీర్ ఖాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మారియోట్ ఫెర్‌ఫార్మెన్స్‌పై కత్రీనా స్పందిస్తూ... డిసెంబర్ 31న జరిగే న్యూయర్ మారియోట్ షోలో అన్ని ఒప్పందాలు కుదిరాక పాల్గొంటానని తెలిపింది. ఈ షోలో ఇంకా అందంగానూ, అద్భుతమైన నాట్యంతో ప్రేక్షకులను అలరిస్తానని చెప్పింది.
అయితే.. ఈ న్యూఇయర్ కార్యక్రమంలో కత్రీనా ఏ పాటకు నర్తిస్తుందో ఇంకా తేలాల్సి వుంది. ఇంకా.. పాటలు ఎంపిక చేయలేదు. ఆ ఒక్క పాట మాత్రం సూపర్ హిట్ సాంగ్‌గా ఉంటుందని ఆమె చెప్పారు.