"హృతిక్ రోషన్" సరసన దీపికా పడుకునే!
బాలీవుడ్ యూత్ హీరో హృతిక్ రోషన్ సరసన అందాల భామ దీపికా పడుకునే నటించనుందట. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా దీపికాను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
షారూఖ్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించిన దీపికా తాజాగా... "చాందినీ చౌక్ టు చైనా" అనే చిత్రంలో అక్షయ్ కుమార్ చెంతన నటిస్తోంది. సైఫ్ సొంత నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో... హృతిక్ రోషన్‌తో కొత్త చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిన దీపికాకు బాలీవుడ్‌లో గిరాకీ బాగా పెరిగిపోయిందని సినీ వర్గాల సమాచారం.
ఇకపోతే... హృతిక్ తాజా చిత్రం "కైట్స్" సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాకేష్ రోషన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా నటించిన హృతిక్, ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడపడానికి విదేశాలకు వెళ్లారు. ఆయన రాగానే సంజయ్ లీలా కొత్త సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమౌతోందని తెలిసింది.