శ్రీశాంత్‌తో లవ్వా..? అవన్నీ వదంతులే..!
భారత క్రికెట్ జట్టు బౌలర్ శ్రీశాంత్‌తో అందాల భామ శ్రియ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని వచ్చిన వార్తలకు తెరపడింది. శ్రీశాంత్‌తో తాను ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఏ మాత్రం నిజం కాదని శ్రియ కొట్టిపారేసింది. రెండు రోజుల క్రితం ముంబైలో శ్రియ, శ్రీశాంత్ నృత్యం చేశారని, అనంతరం కలిసి కారులో వెళ్లారని వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్తలపై స్పందించిన శ్రియ ఇవన్నీ వదంతులేనని మండిపడింది. తనపై గల అసూయతోనే కొందరు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఇప్పటి వరకూ తాను శ్రీశాంత్‌ను అసలు కలుకోలేదని శ్రియ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. అతి తక్కువ కాలంలో అగ్రస్థాయి కథానాయికగా పేరు తెచ్చుకున్న శ్రియ... 'ఇష్టం' సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.
అనతి కాలంలోనే తమిళం, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు హాలీవుడ్ చిత్రంలో నటించే అరుదైన అవకాశం కూడా లభించింది. దీంతో బిజీబిజీగా ఉంటున్న ఈ భామ ఇటీవల హాలీవుడ్ హీరో ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవన్నీ ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే...!