"నాగచైతన్య" కొత్త చిత్రంలో శ్వేత ప్రసాద్..?
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య టాలీవుడ్ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నాగ చైతన్య కొత్త చిత్రానికి వాసువర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ మూడో తేదీ నుంచి హైదరాబాద్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో... యాక్షన్ సన్నివేశాలను పండించేందుకు నాగచైతన్య గుర్రపు స్వారీ, బైక్ ఛేజింగ్‌లను నేర్చుకుంటున్నారని తెలిసింది. ఇకపోతే... చైతన్య కొత్త సినిమాలో నటించే హీరోయిన్‌ను దిల్‌రాజు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే హీరోయిన్ పేరును మాత్రం దిల్‌రాజు సస్పెన్స్‌గా ఉంచారు.
అయితే "కొత్త బంగారు లోకం"లో నటించిన శ్వేత ప్రసాద్‌ను నాగచైతన్య సరసన జోడీగా దిల్‌రాజు ఎంపిక చేసినట్లు ఫిలిమ్ నగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజానికి నాగచైతన్య సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలుసుకోవాలంటే.. ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే...!