ఇలియానా డైరీ ఫుల్..!
"దేవదాసు", "పోకిరి", వరుస విజయాలతో టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఇలియానా ముద్ర వేసుకుంది. ఈ భామ ప్రస్తుతం రెమ్యునరేషన్‌గా కోటి రూపాయలు పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేవదాసు, పోకిరి వంటి సినిమాల తర్వాత ఆమె నటించిన తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో పవన్ సరసన నటించిన "జల్సా" కాస్త ఊపిరి పోసింది.
ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. కోటి రెమ్యునరేషన్ నుంచి దిగి వచ్చిందో.. లేక ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారో తెలీయదుగానీ... చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. కాల్షీట్స్‌తో 2009 ఇలియానా డైరీ హౌస్‌ఫుల్ అయింది.
"దేవదాసు"తో ఇలియానాను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వై.వి.యస్ చౌదరి తాజా చిత్రం "సలీం"లో ఆమె కథానాయిక. మోహన్‌బాబు కుమారుడు విష్ణు కథానాయకుడు. లక్ష్మీప్రసన్న పీక్చర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న 50వ చిత్రమిది.
అదే విధంగా రవితేజ, దర్శకుడు సురేంద్రరెడ్డి కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా ఇలియాన నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రంలోనూ ఇలియానా కథానాయికగా నటిస్తున్న సంగతి తెల్సిందే.
ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. "ఆది", "సాంబ" తర్వాత ఎన్టీఆర్, వి.వి. వినాయక్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. సాంబ చిత్రాన్ని నిర్మించిన కొడాలినాని సమర్పణలో వల్లభనేని వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలాగే నితిన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఇలా యూత్ హీరోల సరసన నటించిన ఇలియానా దీనితో ఆగిపోకుండా... టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్‌కు జోడీగా కూడా తెరపైకి రానుందట..!.. ఇంకేముంది... ఇలియానాకు అదృష్టం పండినట్లేగా...?