1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

మరో జాతీయ అవార్డు కోసం ప్రియామణి కసరత్తు!

వినోదం వెండితెర గుసగుసలు ఎవరే అతగాడు మరో జాతీయ అవార్డు ప్రియామణి కసరత్తు టాలీవుడ్ పెళ్లయిన కొత్తలో
"ఎవరే అతగాడు" సినిమా ద్వారా తెలుగు సినీ రంగప్రవేశం చేసిన అందాల ముద్దుగుమ్మ ప్రియామణి. టాలీవుడ్‌లో ప్రియామణి నటించిన కొన్ని చిత్రాలు గుర్తింపు సంపాదించకపోవడంతో అమ్మడు కోలీవుడ్‌పై దృష్టి సారించింది. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా తన హవాను కొనసాగించిన ఈ భామ "పెళ్లయిన కొత్తలో" సినిమా ద్వారా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "పరుత్తివీరన్" సినిమాకు జాతీయ అవార్డును అందుకున్న అందాల భామ ప్రియామణికి తాజాగా టాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్. "హరేరామ్" సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించిన ప్రియామణి.. తాజాగా బాలకృష్ణ కొత్త చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. "పరుత్తివీరన్" చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్న ప్రియామణి మరో జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందట..!. ప్రముఖ నటి శ్రీ విద్య జీవితం ఆధారంగా మలయాళంలో "తిరక్కథ" అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీ విద్య పాత్రను ప్రియామణి పోషిస్తోందని తెలిసింది. జాతీయ అవార్డు కోసం ఈ చిత్రాన్ని పంపాలని ప్రియామణి చేతనే డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు సినిమా వర్గాల సమాచారం.
About Writer
SELVI.M