మర్మయోగిలో "అసిన్"కు నో ఛాన్స్...!
పద్మభూషణ్ కమల్ హాసన్ తాజా చిత్రం "మర్మయోగి"లో అందాల భామ అసిన్ ఓ హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. అయితే "మర్మయోగి"లో అసిన్‌కు హీరోయిన్ ఛాన్స్ దక్కలేదని కోడంబాక్కం వర్గాల సమాచారం.
కమల్ సరసన "మర్మయోగి"లో ఐదు హీరోయిన్లు నటిస్తుండగా... ఇప్పటికే త్రిష, శ్రియ చరణ్‌లు హీరోయిన్లుగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి.
ఇంతకీ... మర్మయోగిలో "గజిని" భామ నటించకపోవడానికి కారణమేమిటని ఆరాతీస్తే... ప్రస్తుతం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్‌లతో అసిన్ కొత్త సినిమాలు చేయటమేనని తెలిసింది. అందుకే కమల్ సరసన నటించే ఛాన్స్‌ను అమ్మడు మిస్ చేసుకుందని సమాచారం.
ఇంకా చెప్పాలంటే... అసిన్ హాలీవుడ్‌లో వాల్ట్ డిస్నీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న "ది 19 స్లీప్" అనే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు జపాన్ సినీ తార తడనోబు నటిస్తోందట.
బహుభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ దర్శకత్వం వహించనున్నారు. తమిళం, ఆంగ్లం, జపనీస్ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు బారత్ బాలా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. "ది 19 స్లీప్"లో అసిన్ జపనీస్ యువరాణిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం.