1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"ముంతాజ్" సిగరెట్ తాగుతోంది!

వినోదం వెండితెర గుసగుసలు సెక్స్బాంబ్ ముంతాజ్ సిగరెట్ తాగుతోంది మందు కొట్టడం రౌడీయిజం
సెక్స్‌బాంబ్‌గా ముద్రవేసుకున్న ముంతాజ్ తాజాగా ఓ విభిన్నమైన పాత్రను పోషించింది. ఆ పాత్ర ఎలా ఉంటుందంటే.. సిగరెట్ తాగడం, మందు కొట్టడం, రౌడీయిజం చేయడం వంటి ఛాయలుంటాయని తెలిసింది.

లారెన్స్ నటిస్తోన్న ఈ చిత్రం పేరు "రాజాధి రాజా". ఈ చిత్రంలో ముంతాజ్ మంత్రి పాత్ర పోషిస్తోందట. మరి ఇటీవలే ఆరోగ్యశాఖా మంత్రి సిగరెట్‌ తాగడాన్ని అటు సినిమాల్లోనూ, పబ్లిక్‌లోనూ నిషేధించారు. మరి ఈ చిత్రం పరిస్థితి ఏమౌతుందో వేచి చూడాల్సిందే...!.

టి.రాజేందర్ ద్వారా తమిళ తెరకు పరిచయమైన ముంతాజ్ అంచనాలు తలకిందులై చానాళ్లు అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. సెక్సీ రోల్స్ చేసి తన కెరీర్ తానే నాశనం చేసుకున్న ముంతాజ్‌కు మళ్లీ రాజేందర్ మరోమారు తన సొంత చిత్రం 'వీరాసామి' చిత్రంలో అవకాశం ఇచ్చి ఆమె కెరీర్‌కు మళ్ళీ ప్రాణం పోశారు.

దీంతో కోలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ముంతాజ్, తాజాగా లారెన్స్ నటిస్తోన్న కొత్త చిత్రంతో పాటు "థిక్ థిక్" అనే తమిళ చిత్రంలోనూ నటిస్తుంది.