1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"వీర్" చిత్రంలో గ్రీకు వీరుడుగా సల్మాన్..!

వినోదం వెండితెర గుసగుసలు బాలీవుడ్ గ్రీకు వీరుడు సల్మాన్ వీర్ విభిన్న పాత్ర అనిల్ శర్మ హెయిర్ స్టైల్
బాలీవుడ్ గ్రీకు వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం "వీర్". ఈ సినిమాలో సల్మాన్ విభిన్న పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు... ఆయన సిక్స్ ప్యాక్‌ బాడీతో వేర్వేరు గెటప్‌లలో ప్రేక్షకులను అలరించనున్నారని తెలిసింది. ఇంకా చెప్పాలంటే... అనిల్ శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "వీర్" చిత్ర కథను ఎవరు రాశారో తెలుసా? సల్మాన్‌ ఖానే...!.

ఇకపోతే... ఈ చిత్రంలో సల్మాన్ కొత్త హెయిర్ స్టైల్ అభిమానులు ఆకట్టుకుందని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. గ్రీకు పౌరాణిక యోధుడికి సంబంధించిన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో గ్రీకు వీరుడు లాంటి వస్త్రధారణలో చేతికి గాజులు వంటివి తొడిగి ప్రత్యేక గెటప్‌లో సల్మాన్ ఖాన్ తెరపైకి రానున్నాడు.

ఇదిలా ఉండగా... "వీర్" చిత్రకథకు సంబంధించిన పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసేందుకుగానూ.. సల్మాన్ బరువెక్కాడట..!. మరోవైపు.. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం సల్మాన్ 20 కోట్లు వెచ్చించినట్లు సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.