పాడు దోమ కుట్టి చచ్చింది: సెక్సిణి మల్లిక
|
ఇంతకీ మల్లిక అనారోగ్యానికి కారణమేమిటో తెలుసా... ఇటీవల కీకారణ్యాల్లో సినీ షూటింగ్‌లు జరుపటం ఆనవాయితీగా మారిపోయింది. అందునా మల్లికలాంటి సెక్సీ తారలను అడవుల్లో లేత ఆకులమధ్య, పచ్చపచ్చని చెట్ల అందాల మధ్య మరింత అందంగా చూపించవచ్చని దర్శకులు కేరళ అడవుల్లో షూటింగ్ ఏర్పాటు చేశారు.
అడవులు, సెలయేళ్ల నడుమ బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికా అర్థనగ్నంగా నటించేసింది. కేరళలోని పాడు దోమ ఒకటి మల్లికను కరిచిందట. అంతే రాత్రికి రాత్రే మల్లిక చలిజ్వరంతో వణకటం ప్రారంభించిదట. అయితే ఆ జ్వరంతోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసిందట. ప్రస్తుతం కేరళ ఆయుర్వేద మందులకోసం ఎదురుచూస్తోందట. అప్పటివరకూ బెడ్ పై నుంచి దిగేది లేదని తెగేసి చెప్పేసిందట.
