1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

దక్షిణ సినీ పరిశ్రమకు బికినీ ఫీవర్..?

వినోదం వెండితెర గుసగుసలు దక్షిణ సినీ పరిశ్రమ బికినీ ఫీవర్ నయన త్రిష ప్రియామణి
హాలీవుడ్ పరిశ్రమకు వచ్చిన బికినీ ఫీవర్ ప్రస్తుతం దక్షిణ భారతదేశానికి సోకినట్టుంది. ఎందుకంటారా? ఈ మధ్య దక్షిణాది సినీ రంగాల్లోని కథానాయికలు బికినీలను ధరించి తమ క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు సినీ నిర్మాతలు కూడా తమ చిత్ర విజయవంతం కోసం హీరోయిన్లను బికినీ డ్రస్సుల్లో హాట్ హాట్‌గా కన్పించేలా చేస్తున్నారు.

ఒకవైపు అందాలను ఆరబోస్తూ... మాస్‌ను ఆకట్టుకుంటున్న హీరోయిన్లు ప్రస్తుతం బికినీల వైపు దృష్టి మరల్చారు. వీరిలో ప్రస్తుతానికి చెప్పుకోదగిన హీరోయిన్లు ఎవరంటే...? నయన, త్రిష, ప్రియామణి. కోలీవుడ్ అల్టీమేట్ స్టార్ అజిత్ సరసన సెక్సీక్వీన్ నయన బికినీలో కనిపించి మాస్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇదే విధంగా అగ్ర నటి త్రిష కూడా తన కొత్త చిత్రంలో బికినీలో కన్పించనుందని వార్తలొచ్చాయి. ఇక "పరుత్తివీరన్" అనే తమిళ సినిమా ద్వారా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రియామణి కూడా తాజాగా ఇదే కోవలో పయనిస్తోంది.

టాలీవుడ్‌లో వెల్లువల్లా వస్తున్న అవకాశాలను ప్రియామణి సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగా... అగ్రహీరో బాలయ్య సరసన హీరోయిన్‌గా ప్రియామణి నటిస్తోంది. అంతేకాకుండా నితిన్‌కు జోడీగా నటించే "ద్రోణ" సినిమాలో ఈ అందాల భామ బికినీలో కన్పించనుందని సమాచారం. ఇంకేముంది... దక్షిణ భారత దేశ సినీ రంగానికి కూడా బికినీ ఫీవర్ వచ్చినట్టేగా...?
About Writer
SELVI.M