"సానియా మీర్జా" ప్రేమలో నవదీప్!
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నవదీప్ మరోసారి ప్రేమాయణంలో మునిగారు. "చందమామ"లో ఓ హీరోగా చేసిన నవదీప్ అంతకు ముందు సోలో హీరోగా తెలుగులో రాణించలేకపోయాడు. తన సరసన నటించే హీరోయిన్లతో చనువుగా ఉంటాడని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఆయన ప్రేమలో పడింది.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో...!
గతంలో మోహన్‌బాబు తనయుడు విష్ణువర్ధన్‌కు ఆమెకూ మధ్య ఏదో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. ఎందుకంటే? విష్ణువర్ధన్ సినిమా ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథిగా సానియా మీర్జా హాజరయ్యేది. వారిద్దరూ క్లాస్‌మేట్స్ అంటూ విష్ణుసన్నిహితులు చెబుతుండేవారు. అయితే విష్ణువర్ధన్‌కు సీఎం బంధువు కుమార్తెతో నిశ్చితార్థం అయ్యాక ఇక అదంతా ఫ్రెండ్‌షిప్పే అనుకోవాల్సివచ్చింది.
ప్రస్తుతం నవదీప్, సానియా మీర్జాలు సంయుక్తంగా కొన్ని ఫంక్షన్లకు హాజరవుతున్నారట. ఫోన్లలో కూడా ఎక్కువ సేపు మాట్లాడుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.
ఇకపోతే.... ఇద్దరికీ వృత్తిపరంగా పోలిక ఉంది. తన పూర్వవైభవం కోసం సానియా తపిస్తుంటే.. హీరోగా నిలదొక్కుకునేందుకు నవదీప్ ప్రయత్నిస్తుండటం. వీరి ఆశయాలు నెరవేరినప్పుడే ఇద్దరూ ఒక్కటవుతారనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. మరీ... ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడైన నవదీప్ ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే...!