1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"పూరీ" కొత్త చిత్రంలో ముమైత్, బింధు

వినోదం వెండితెర గుసగుసలు పూరీ కొత్త చిత్రం టాలీవుడ్ సెక్సీక్వీన్ ముమైత్ బింధు మాధవి ఆవకాయ్ బిర్యాని
ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ తాజాగా రూపొందే చిత్రంలో "ఆవకాయ్ బిర్యాని" ఫేం బింధుమాధవి హీరోయిన్ ‌గా నటిస్తోందట. అంతేకాకుండా... టాలీవుడ్ సెక్సీక్వీన్ ముమైత్ ఖాన్‌కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుందని సినీ వర్గాల సమాచారం.

ఇంకొక విశేషమేమిటంటే... ఈ చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్ సోదరుడు హీరోగా పరిచయం కాబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం (2009) జనవరి నుంచి ప్రారంభం కానుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. "ఆవకాయ్ బిర్యానీ"లో కథానాయికగా నటించిన బింధుమాధవి... పూరీ సోదరుడు సరసన నటించనుంది.

ఇకపోతే... పూరీ కొత్త చిత్రానికి "కోతులు" అనే టైటిల్‌ను పెడుతున్నట్లు తెలిసింది. "టైటిల్" సంగతికొస్తేనే విభిన్నంగా ఉంది... మరి సినిమా ఎలా ఉంటుందో? వేచి చూడాల్సిందే...!