1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కళ్యాణ్ రామ్ సరసన హన్సిక..!

వినోదం వెండితెర గుసగుసలు కళ్యాణ్ రామ్ సరసన హన్సిక టాలీవుడ్ బ్యూటీక్వీన్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన హన్సిక నటించబోతుందట. టాలీవుడ్ బ్యూటీక్వీన్‌గా పేరు కొట్టేసిన ఈ భామ.. "కంత్రి", "దేశముదురు" వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న "బిల్లా"లో ఐటమ్ సాంగ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో... నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ హీరోగా నటించి విడుదలైన "అతనొక్కడే", "హరేరామ్" వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇదే పతాకంపై కళ్యాణ్ రామ్ హీరోగా మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ కొత్త చిత్రంలో "హన్సిక" కథానాయికగా నటించనుందని ఫిలిం నగర్ వర్గాలు కోడైకూస్తున్నాయి. కళ్యాణ్ రామ్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటించబోయే కొత్త చిత్రానికి నరేష్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.