1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కోడలు అన్వేషణలో ''చిరు'' సతీమణి

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ జీవిత భాగస్వామి అన్వేషణ సురేఖ
FileFILE
మెగాస్టార్ చిరంజీవి ఏకైక కుమారుడు రామ్ చరణ్ తేజ్‌ జీవిత భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. ప్రజా అంకిత యాత్రలో నిమగ్నమై బిజీబిజిగా ఉన్న విషయం తెల్సిందే. మరోవైపు.. చిరు సతీమణి సురేఖ మాత్రం తనకు కాబోయే కోడలు కోసం అన్వేషణలో నిమగ్నమై ఉన్నట్టు రాజధాని ఫిల్మ్ వర్గాల వినికిడి.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రంలో చరణ్‌తేజ్ నటిస్తున్నారు. ఇదిలావుండగా తన తొలి చిత్ర హీరోయిన్ నేహా‌తో చరణ్ పెళ్లి చేసుకున్నట్టు వదంతులు కూడా వచ్చాయి. అయితే వీటిని యువహీరో కొట్టిపారేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అనంతపురానికి చెందిన పారిశ్రామికవేత్త తనయురాలిని వివాహం చేసుకుంటాడన్న వార్తలు విస్తృతంగా విన్పిస్తున్నాయి.

ఇప్పటికే ఆ పారిశ్రామికవేత్త చిరంజీవి పార్టీ పరంగా హంగు, ఆర్భాటాలతో పాటు.. ఇతర సౌకర్యాలను సమకూర్చినట్టు తెలిసింది. అయితే వివాహం ఎన్నికల తర్వాత జరుగుతుందని స్పష్టమవుతోంది.
About Writer
PNR