1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

తొలి అనుభవాన్ని మర్చిపోలేను: ప్రియాంక

వినోదం వెండితెర గుసగుసలు తొలి అనుభవం మర్చిపోలేను ప్రియాంక చోప్రా కోలీవుడ్ రజనీ కాంత్
తన తొలి అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని బాలీవుడ్ అగ్రనటి ప్రియాంక చోప్రా అంటోంది. అదేమిటబ్బా? చోప్రా తొలి అనుభవం అనుకుంటున్నారా? అదేనండీ... కోలీవుడ్‌లో ఆమె నటించిన తొలి చిత్ర అనుభవాన్ని ఎన్నటికీ మరిచిపోలేనని ప్రియాంక చెబుతుందట.

బాలీవుడ్‌లో ఎదురులేని హీరోయిన్‌గా ముద్రవేసుకున్న చోప్రా... కోలీవుడ్ యంగ్ హీరో విజయ్ సరసన "తమిళన్" అనే సినిమాలో నటించింది. కోలీవుడ్‌లో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని చోప్రా వెల్లడించింది.

అంతేకాదు... హాలీవుడ్ నటుడు డేనియెల్ క్రెయిగ్‌తో నటించడం కంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించడమే ఇష్టమని ప్రియాంక అంటోందట. క్రెయిగ్‌తో నటించడం చాలా ఇష్టమేనని, కానీ ఆయన కంటే రజనీ కాంత్‌తో జతకట్టడం తనకెంతో నచ్చుతుందని చోప్రా తెలిపిందట...!. ఇంకేముంది... ప్రియాంక చోప్రా రజనీకాంత్‌తో కలిసి నటిస్తుందా...? ఇంతకీ ఆమె కల నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సిందే...!