1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"బిపాసా" బెంగాలీ సినిమా సంగతి ఏమైంది?

వినోదం వెండితెర గుసగుసలు బిపాసా బసు బెంగాలీ సినిమా షాబ్ చరిత్రో కల్పోనిక్ రితుపర్ణ ఘోష్ డబ్బింగ్
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ బిపాసా బసు బెంగాలీ సినిమాపై సినీ వర్గాల్లో వివిధ రకాలైన గుసగుసలు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ అవకాశాలు ఆశించినంతలో లభించని బిపాసాకు బెంగాలీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కిందని సినీ వర్గాల సమాచారం.

"షాబ్ చరిత్రో కల్పోనిక్" అనే పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ బెంగాలీ చిత్రంలో బిపాసా కథనాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించేందుకు బిపాసా బసు చాలా సమయం తీసుకుంటుందని సమాచారం.

ఈ నేపథ్యంలో.. తాజా బెంగాలీ సినిమా షూటింగ్‌లో బిపాసాకు తెగ కోపం వచ్చిందట. ఇంతకీ బసు కోపానికి కారణమేమిటని ఆరా తీస్తే...ఈ చిత్ర దర్శకుడు రితుపర్ణ ఘోష్‌కు తన చిత్రాల్లో నటించే ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పించుకునే అలవాటుందట. ఇదే తరహాలో తన సినిమా కథానాయిక అయిన బిపాసా పాత్రకు కూడా వేరొకరితో డబ్బింగ్ చెప్పించాడట.

ఇప్పటి వరకు సినిమా చరిత్రలో తన రోల్‌కు ఎవరి చేత డబ్బింగ్ చెప్పించుకోని బిపాసా బసు ఈ విషయం తెలిసిన వెంటనే మండిపడిందట. తన రోల్‌కు ఇంకొకరు డబ్బింగ్ చెప్పడమా? అంటూ చిందులేసిందట.!

దీంతో బిపాసా బసు బెంగాలీ సినిమా సంగతి ఏమౌతుందోనని సినీ వర్గాల్లో సంశయం తలెత్తింది. ఇకపోతే... "షాబ్ చరిత్రో కల్పోనిక్" చిత్రంలో సెక్సీతార బిపాసా అందమైన గృహిణిగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
About Writer
SELVI.M