1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

పారిశ్రామికవేత్త మనస్సు దోచిన ''కైఫ్''

అందచందాలు కుర్రకారు మనస్సు గిలిగింతలు బాలీవుడ్ ముద్దుగుమ్మ పారిశ్రామికవేత్తలు మనస్సు ప్రేమాయణం కత్రినా కైఫ్ వాణిజ్య
FileFILE
తన అందచందాలతో కుర్రకారు మనస్సుల్లో గిలిగింతలు పెడుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్.. తాజాగా పారిశ్రామికవేత్తల మనస్సును సైతం దోచుకుంటోంది. ఓ వైపు తన ప్రియుడు బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌తో ప్రేమాయణం నడుపుతున్న ఈ పొడగుకాళ్ళ సుందరి.. తాజాగా ముంబైకు చెందిన ఒక పారిశ్రామికవేత్త మనస్సు దోచుకునన్నట్టు సమాచారం. ముంబైలో జరిగిన ఒక వాణిజ్య కార్యక్రమంలో వీరిద్దరు కలిసి పాల్గొన్నట్టు సమాచారం.

అయితే ఈ వార్తలను కత్రినా కైఫ్ కొట్టేశారు. ప్రముఖ వాణిజ్య కంపెనీకి తాను అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని, ఆ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన నగల ప్రదర్శనలో తాను ఒక్కదాన్నే పాల్గొన్నట్టు వివరణ ఇచ్చింది. అయితే.. కత్రినా కొత్త ప్రియుడి వార్తలు మాత్రం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గుప్పుమన్నాయి. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో కత్రినా టూపీస్ దుస్తుల్లో పాల్గొని ఆహుతులను ఎంతగానే ఆకట్టుకున్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి