1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

టాలీవుడ్‌లో "నయన"కు అగ్రస్థానం దక్కేనా..?

వినోదం వెండితెర గుసగుసలు టాలీవుడ్ నయన అగ్రస్థానం మలయాళం బాడీగార్డ్ దుబాయ్ శీను సెల్యూట్
కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకుని తన అందచందాలతో యువతను ఆకర్షిస్తున్న అందాల ముద్దుగుమ్మ నయనతార టాలీవుడ్‌లో టాప్‌లో నిలవాలని ఉబలాటపడుతోందట. అంతేగాకుండా టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా కొనసాగేందుకు నయన శాయశక్తుల ప్రయత్నిస్తోందని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.

ఇప్పటికే... "దుబాయ్ శీను", "సెల్యూట్" వంటి చిత్రాలు నయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన నేపథ్యంలో.. తెలుగు సినీ రంగాన్ని శాసిస్తున్న టాప్ హీరోయిన్లను వెనక్కు నెట్టి నెంబర్‌ వన్‌ స్థానాన్ని సంపాదించేందుకు నయన కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా... టాలీవుడ్ నుంచి వచ్చే ఛాన్స్‌లను చక్కగా ఉపయోగించుకోవాలని అమ్మడు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మలయాళంలో "బాడీగార్డ్" అనే చిత్రంలో నయనతార నటిస్తోంది. కొట్టాయం సిఎంఎస్ కాలేజీలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో నయనను చూసేందుకు ఆమె అభిమానులు భారీ ఎత్తున వచ్చారని యూనిట్ తెలిపింది. దక్షిణాది సినీపరిశ్రమలో నయనతారకు పెద్ద ఎత్తున అభిమానులున్నారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా... కోలీవుడ్ యంగ్ హీరో విజయ్ సరసన నయనతార నటించిన "విల్లు" సినిమా కోసం ఆమె అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
About Writer
SELVI.M