1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"శియ" ప్లాస్టిక్ సర్జరీ చేసుకోబోతుందట...!

వినోదం వెండితెర గుసగుసలు శియ ప్లాస్టిక్ సర్జరీ నేనింతే పూరీ జగన్నాథ్ రవితేజ ముక్కు సినీ కెరీర్
తన అందచందాలతో హీరోలనే అమ్మో... అనిపించే "నేనింతే" ఫేం కథానాయిక "శియ". తెలుగు సినీ పరిశ్రమకు "నేనింతే" సినిమా ద్వారానే హీరోయిన్‌గా పరిచయమయినప్పటికీ... టాప్ హీరోయిన్లతో పోటీకి సై అంటోందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

మరోవైపు... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రవితేజ సరసన నటించిన "నేనింతే" సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో శియకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయని సినీ వర్గాల సమాచారం.

అయితే... శియకు అందం ఉండి ఏం ప్రయోజనం? ఆమె ముక్కు పెద్దదిగా ఉందని టాలీవుడ్ వర్గాలు గేలి చేస్తున్నాయట..!. అంతేగాకుండా ఆ ముక్కుతో ఆమెకు దక్కే సినిమా ఆఫర్లు చేజారిపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు జోస్యం చెబుతున్నాయట.

దీంతో... శియ జడుసుకుని తన ముక్కును ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలని భావిస్తోందట. తన సినీ కెరీర్‌కు కేవలం ముక్కు అంతరాయంగా ఉండకూడదని శియ అనుకుంటుందట. తొలి సినిమాతోనే అగ్రహీరోయిన్లకు ధీటుగా నిలిచిన శియ టాలీవుడ్‌లో రాణించాలని భావిస్తోందట.

ఇంకేముంది...? హీరోయిన్‌గా ఎదిగేందుకు శ్రీదేవి, ప్రియాంక చోప్రాల బాటలోనే శియ కూడా పయనిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
About Writer
SELVI.M