1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"కొంచెం ఇష్టం కొంచెం కష్టం" పైరసీ..!

వినోదం వెండితెర గుసగుసలు కొంచెం ఇష్టం కొంచెం కష్టం పైరసీ సిద్ధార్థ తమన్నా నల్లమలుపు బుజ్జి
WD
ఇదేమిటీ... ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. అప్పుడే పైరసీ ఏమిటి? అనే సందేహం కలిగిందా? మీరు ఊహించింది నిజమే... సిద్ధార్థ, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. డి. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకావాల్సింది. కానీ అప్పటికే సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిత్రాలు విడుదల కావడంతో థియేటర్లు లభించక సినిమా విడుదలను వాయిదా వేశారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే... ఇటీవలే హైదరాబాద్‌లోని బిర్లా ఎంపోరియమ్‌లో జరుగుతున్న రవితేజ చిత్రం షూటింగ్‌కు నల్లమలుపు బుజ్జి వచ్చారు. ఈ కార్యక్రమంలో బుజ్జి... రవితేజ సినిమా కోడైరక్టర్ గోవర్ధన్‌పై చేయిచేసుకున్నాడని సైఫాబాద్‌లో కేసు నమోదైంది.

ఇంతకీ అసలు విషయమేమిటా అని ఆరాతీస్తే... బుజ్జిరాగానే.. గోవర్థన్ పలకరింపుగా వచ్చి.. సార్! మీరు తీసిన "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సూపర్‌గా ఉంది సార్.. మొన్ననే చూశానని చెప్పాడు. దీంతో బుజ్జి షాక్‌కు గురై... అసలు సినిమానే రిలీజ్ కాలేదు. నువ్వెలా చూశావని, పైరసీ ఎక్కడ జరుగుతోందని చెప్పమంటూ.. కోపంతో చేయిచేసుకున్నాడట..! మరి కోట్లు పెట్టిన వ్యక్తికి ఆ మాత్రం కోపం సహజమే కదా..? ఇందండీ సినిమా పైరసీ అంటే... ప్రస్తుతం కేసును గోవర్థన్ ఉపసంహరించుకునే దశలో ఉన్నారని తెలిసింది.
About Writer
SELVI.M