1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"గుండు" అంటే గుండు పగలగొడతా: శిల్పా

శిల్పాశెట్టి బోడి గుండు బాలీవుడ్ చైనా సినిమా శిల్ప శివాలు
IFM
బాలీవుడ్‌ను ఓ ఊపి ఆ తర్వాత హాలీవుడ్‌లో అడుగిడిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టికి విదేశాల నుంచి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయట. అవకాశాలు బోలెడు వస్తున్నా... ఒక్క సినిమా కూడా అంగీకరించడం లేదట.

"ఎందుకని శిల్పా..?" అని ఓ పిల్ల జర్నలిస్టు అడిగితే పెద్దగా నిట్టూర్చిందట. కింది పెదవిని మరీ కిందికి విరిచి "వాటి గురించి ఏం చెప్పేదిలే" అన్నట్లు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లిపోయిందట. అయినా పట్టు వదలని విక్రమార్కునిలా సదరు పిల్ల జర్నలిస్టు.. ఆమె సన్నిహితురాలిని అసలు సంగతి చెప్పమని బతిమాలితే... చివరికి ఆమె ఇలా చెప్పుకొచ్చిందట.

"శిల్పకు అవకాశాలు వరదలా వస్తున్నాయి. అయితే అందులో ఆమె నటించాల్సిన పాత్రలు మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. ఆ మధ్య ఓ ప్రముఖ చైనా దర్శకుడు ఫ్లైట్ చార్జీలు పెట్టి శిల్పను అక్కడికి రప్పించి కథ మొత్తం వివరించాడు.

కథ సూపర్‌గా ఉంది. అయితే కథాపరంగా శిల్ప బోడిగుండు చేయించుకోవాలట. అదేమాటను శిల్పతో చెప్పాడు. సినిమా అంతా గుండుతోనే కనబడాలని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు. బోడి గుండు మీకు ప్లస్ పాయింట్ అవుతుందని వెటకారాలు పోయాడు. అంతే శిల్ప శివాలెత్తింది.

ఈ సంగతి ఫ్లైట్ టికెట్ బుక్ చేసే ముందు చెప్పాలని కస్సుబుస్సులాడింది. చివరికి దర్శకుడు కాళ్లావేళ్లా పడేసరికి తన సెక్సీ వెంట్రుకలపై గుండులాంటి మాస్క్ ధరించి నటించటానికి ఒప్పుకుంది" అని చెప్పిందట.

అయినా సంతృప్తి చెందని సదరు జర్నలిస్ట్... " కానీ ఈ చిత్రంలో శిల్ప నిజంగానే బోడిగుండు చేయించుకుందని అందరూ అంటున్నారే...?"

"ఈ మాట నా దగ్గరే అంటే అన్నావుగానీ, శిల్ప దగ్గర అనకు. ఇప్పటికే ఈ ప్రశ్నను శిల్పను సుమారు ఓ వేయిమంది అడిగారు. మరొకరెవరైనా గుండు గురించి అడిగితే అతని గుండు పగలకొడతానంది." అంతే.. పిల్ల జర్నలిస్టు నెత్తిమీద హెల్మెట్ వేసుకుని తుర్రుమన్నాడట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT