కత్రినా... సల్మాన్‌ను చేసుకున్నావా...?
సినీ తారలకు సంబంధించి గుసగుసలు ఫిలింనగర్ వర్గాల్లో షికార్లు చేయడం సహజమే. అదీ టాప్ హీరోహీరోయిన్లైతే ఏం చేసినా... సినీ వర్గాలు వాటికి ఏవేవో కథలు అల్లేస్తూ ఉంటాయి. ఇదే తరహాలో.. బాలీవుడ్ సినీ వర్గాల్లో సల్మాన్-కత్రినాలపై ఓ హాట్ న్యూస్ షికార్లు చేస్తోంది. అదేమిటంటే..? బాలీవుడ్ యంగ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్‌లు వివాహం చేసుకున్నారంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ఓ వార్తను ప్రచురించింది.
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్... సామ్నా పత్రికకు ఇచ్చి ఓ ఇంటర్వ్యూలో సల్మాన్- కత్రినా కైఫ్‌ల వివాహం జరిగిందనే విషయాన్ని చెప్పినట్లు సామ్నా పత్రిక వెల్లడించింది.
ఈ పత్రిక ప్రచురించిన వార్త అటు సినీ వర్గాల వారికి, ఇటు పత్రికా రంగం వారికి ఉత్సుకతను రేకెత్తించింది. ఒకవైపు సల్మాన్-కత్రినాలకు సన్నిహితులు ఫోన్లు చేసి నిజమేనానని అడగడం.., మరోవైపు.. మీడియా సల్మాన్-కత్రినాలను ఎక్కడకనబడితే అక్కడ చుట్టుముట్టడం చేశాయి.
దీంతో.. మీడియా ముందు కత్రినాకైఫ్ తీవ్రంగా స్పందించింది. అసలు తామింకా పెళ్లే చేసుకోలేదని కైఫ్ స్పష్టం చేసింది. ఈ వార్తను ప్రచురించిన సామ్నా పత్రిక వెంటనే ఈ విషయంలో తమకు క్షమాపణ చెప్పాలని కత్రినా డిమాండ్ చేసింది. అలా సామ్నా పత్రిక క్షమాపణ చెప్పని పక్షంలో ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తానని కత్రినా హెచ్చరించింది.
ఇదే వార్తపై సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్ కూడా తాను ఆ విధంగా వ్యాఖ్యానించలేదని, సామ్నా విలేకరి తప్పుగా అర్థం చేసుకున్నాడని వివరణ ఇచ్చాడు.
ఇంకేముంది..? సామ్నా పత్రిక ఈ విషయంపై సల్మాన్-కత్రినాల వద్ద క్షమాపణ అడుగుతుందో..? లేదా.. పరువునష్టం దావా కేసును ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే...?