అబ్బా... నేహాకు ఎంతకష్టమొచ్చింది...!
"చిరుత" చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఢిల్లీ భామ నేహా శర్మకు చాలా కష్టమొచ్చిందటండీ...! ఏంటబ్బా.. అంతకష్టమని ఆమెను కదిలిస్తే.. ఇదంతా మీడియా వల్లేనని మొహం తిప్పేసుకుంది.
తాజాగా ఎన్టీఆర్-వి.వినాయక్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో నటించేందుకు సిద్ధమైన ఈ భామ... "చిరుత" తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.
నేహాకు, చరణ్ తేజకు వివాహం అయిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో... ఆమెను తమ చిత్రాల్లో ఎంపిక చేసేందుకు పలు నిర్మాతలు వెనుకడుగు వేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆ పుకార్లు సమసిపోయాక ప్రస్తుతం వినాయక్ ఆమెకు ఓ అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. ఈ సినిమాలో నేహాతో పాటు ఇలియానా కూడా నటించనుంది.
ఇన్నాళ్ళకు వినాయక్ ద్వారా ఓ ఛాన్స్ కొట్టేసిన ఈ భామ.. కష్టానికి మీడియా వ్యాపింపజేసిన వదంతులే కారణమట..!. ఇంకేముంది..? వినాయక్ చిత్రం పూర్తయ్యాక... తనను మరో వివాదంలోకి లాగకుండా ఉంటే.. అదే చాలండీ.. బాబూ.. అని నేహా మీడియాను వేడుకొంటోంది.