1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నన్ను "పద్మా శ్రీమతి" అంటున్నారు: ఐశ్వర్య కిలకిల

ఐశ్వర్యారాయ్ పద్మశ్రీ బాలీవుడ్ అభిషేక్ అమితాబ్
IFM
తన భార్య ఐశ్వర్యకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు భర్త అభిషేక్ బచ్చన్ మహా సంతోషంగా ఉన్నాడు. అడిగినవారికి, అడగనివారికి సైతం తన భార్య నటన, గొప్పతనాన్ని వివరిస్తూ లెక్చర్లిస్తున్నాడట.

బయట సంగతి ఇలా ఉంటే... ఇంట్లో ఐశ్వర్యను "పద్మా శ్రీమతి" అని పిలుస్తున్నాడట. అలా పిలిచినప్పుడల్లా ఐశ్వర్య కిలకిలమంటోదట. పులకరించిపోతోందట. అవును భర్తగారే స్వయంగా అభినందిస్తుంటే ఎవరు మాత్రం ఆనందపడరు.

ఇదిలా ఉంటే... తమ కుటుంబంలో మామయ్య అమితాబ్‌జీ, అత్తయ్య జయాజీ, తాత హరివంశరాయ్ బచ్చన్‌జీ... ఇప్పుడు తనకు పద్మశ్రీ అవార్డులు లభించాయని ఐశ్వర్య మహదానందంతో చెప్పింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT