బికినీలా.. అసలొద్దు బాబోయ్..!
ఇక నుంచి తాను బికినీలు వేసే పాత్రలు అసలు చేయనని అందాల ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ తేల్చి చెప్పేసింది. నరేష్ నటించిన "సిద్ధుఫ్రమ్ సికాకుళం" చిత్రంలో యూనిట్ చెప్పిందొకటి చేసిందొకటని అమ్మడు మండిపడింది.
"అప్పుడే ఓ సన్నివేశంలో బికినీ వేయమని చెప్పారు. కానీ అంతకుముందు ఒప్పందం ప్రకారం లేదు కనుక వేయనని కరాఖండిగా చెప్పేశాను. కానీ నా మీద ఒత్తిడి చేసి వేయించారు. గత్యంతరం లేక వేయాల్సి వచ్చిందని.." శ్రద్ధాదాస్ వెల్లడించింది. ఇకపై అలాంటి తప్పు జరగకుండా... ముందుగానే ఇలాంటివి ఉండే సినిమాలను అసలు అంగీకరించనని ఆమె స్పష్టం చేసింది.
మరి బికినీ వేయమని ఒత్తిడి చేసిన చిత్ర నిర్మాతలపై కేసు వేయకూడదా? అంటే.. అంతా అయిపోయింది. దాని గురించి ఇప్పుడు తవ్వుకోవడం అనవసరమని శ్రద్ధాదాస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ప్రస్తుతం ఆమె జగపతిబాబు నటిస్తోన్న "అధినేత" చిత్రంలో కథానాయిక పాత్రను పోషిస్తోంది. మరి ఇందులో ఏ తరహా పాత్రలో ప్రేక్షకులకు దర్శనమిస్తోందో? వేచి చూడాల్సిందే..?