ముసలి హాన్సికగా చేయడానికైనా రెడీ
సినీ పరిశ్రమకు వచ్చిన ప్రతి తారకు ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉండే ఉంటుంది. తమన్నా టైపులో కొందరికి లేకనూ పోవచ్చు. ఇక్కడ తమన్నా విషయం ఏమిటీ... అంటారా...? ఆ మధ్య తమన్నాను "మీ డ్రీమ్ రోల్ ఏదీ అని అడిగితే..." ఇంకా నేను సరిగానే నిలబడలేదు. స్థిరపడ్డాక ఏదైనా అలాంటి ఆలోచన వస్తే... గిస్తే చెప్తానులే అందట.
అయితే "కంత్రీ" హాన్సిక మాత్రం మరోలా స్పందింస్తోందట. "మీకేమైనా డ్రీమ్ రోల్స్...." అనే ప్రశ్నను ముగించకముందే పండు ముదుసలి పాత్రలో నటించాలని ఎన్నాళ్ల నుంచో ఆశగా ఉందని చెప్పేస్తోందట. "భారతీయుడు"లో కమల్ చేసిన పాత్రను చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యానని అంటోందట.
ఇంకేం... ఈ సంగతి కమల్‌కి చెప్పేస్తే తన తదుపరి చిత్రంలో హాన్సికను పండు వృద్ధురాలిగా చూపించే సాహసానికి శ్రీకారం చుడతారేమో.