1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"మాక్సిమ్‌"లో లారాదత్త హాట్.. హాట్...!

వినోదం వెండితెర గుసగుసలు మాక్సిమ్ లారాదత్త హాట్ హాట్ బాలీవుడ్ ఇర్ఫాన్ ఖాన్ బిల్లు బార్డర్ కత్రీనా కైఫ్ అమీషా పటేల్  ఐశ్వర్యారాయ్
IFM
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ లారాదత్త "మాక్సిమ్" మ్యాగజైన్‌లో హాట్... హాట్..గా కన్పిస్తోందట. ఇప్పటికే తన అందచందాలను ఆరబోస్తూ.. యువతను మత్తెక్కిస్తున్న ఈ భామ ఫిబ్రవరి "మాక్సిమ్" మ్యాగజైన్‌లో గ్లామర్‌గా దర్శనమిస్తోందట. ప్రస్తుతం "బిల్లు బార్డర్"లో ఇర్ఫాన్ ఖాన్ సరసన గ్లామరస్ పాత్రను పోషిస్తున్న లారాదత్త, ఈ మ్యాగజైన్ పేజీలలో రీడర్లను పెద్దఎత్తున ఆకర్షిస్తోందని తెలిసింది.

ఇప్పటికే మాక్సిమ్ మ్యాగజైన్ పేజీల్లోకెక్కిన కత్రీనా కైఫ్, అమీషా పటేల్‌ల తర్వాత, లారా దత్త ఈ ఫ్యాషన్ మ్యాగజైన్‌కు రీడర్లను అలరించే విధంగా ఫోజిచ్చిందని సమాచారం. గతంలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నలుపు, ఎరుపు రంగుల కలబోతతో ఉండే స్విమ్‌వేర్ (ఈతదుస్తులు)తో మాక్సిమ్ మ్యాగజైన్ రీడర్లను ఆకట్టుకున్న సంగతి విదితమే.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం "బిల్లు బార్డర్"లో గ్రామీణ మహిళగా నటిస్తున్న లారాదత్త, "బ్లూ" మరియు "లండన్ డ్రీమ్స్"వంటి చిత్రాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
About Writer
SELVI.M