అబ్బే నేనస్సలు పెంచనేలేదు : హన్సిక
|
తనకు సంబంధించి సినిమా కథ, అందులో తన పాత్ర గురించి ఆలోచించడమే తప్ప పారితోషికం ఇంత కావాలని తానెప్పుడూ డిమాండ్ చేయలేదని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. తాజా హిట్ మస్కాతో హన్సిక తన పారితోషికాన్ని కోటికి పెంచేసిందని అందుకే టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్లు ఇచ్చేవారు కరువయ్యారని వచ్చిన వార్తల గురించి ఆమె మాట్లాడుతూ అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చేసింది.
అంతేనా తాను ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నానని అందుకే తెలుగులో నటించడం లేదని హన్సిక తెలిపింది. సమయం చిక్కగానే మళ్లీ తెలుగులో నటిస్తానని ఎందుకంటే తెలుగు చిత్రాలంటే తనకు చాల ఇష్టమని ముక్తాయించింది. తాను పారితోషికం పెంచలేదని హన్సిక అంతగా చెబుతుంటే మనం మాత్రం నమ్మకుండా ఉంటామా ఏంటీ... ఎటొచ్చీ పారితోషికం పెంచడంలో తప్పేమిటీ అని ప్రశ్నిస్తున్న తారల మధ్య హన్సిక ఇలా చెప్పడమే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ.
