1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. సైఫ్ పిల్లకాయలాంటి వాడు: దీపికా పదుకునే

సైఫ్ పిల్లకాయలాంటి వాడు: దీపికా పదుకునే

సైఫ్ అలీఖాన్ దీపికా పదుకునె కరీనాకపూర్ బాలీవుడ్
"తంతే బూరల బుట్టలో పడ్డారు" అనే సామెత దీపిక పదుకునేకు సరిగ్గా అతుక్కుపోతుంది. ఒకటి రెండు సినిమాలు చేసిందో లేదో... వరుసగా అగ్ర హీరోలు ఆమెతో నటించడానికి క్యూ కట్టారు. ఇంకేం... వారికే లెక్చర్లిచ్చే స్థాయికి వెళ్లిపోయింది ఈ కోమలాంగి.

కరీనా తనకు కాబోయే భర్త అని చెప్పుకుంటున్న సైఫ్‌అలీ ఖాన్ సరసన దీపిక "లవ్ ఆజ్ కల్" సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా అతనితో నటించడం దీపకకు మహా సరదాగా ఉందట. షూటింగ్ గ్యాప్‌లో పిల్లకాయ చేష్టలు చేస్తూ భలేగా నవ్విస్తుంటాడని తన సన్నిహితులందరికీ అదేపనిగా చెపుతోందట.

సైఫ్‌ను అతి సమీపం నుంచి గమనించాననీ, అతని అలవాట్లు, కావలసిన వస్తువుల పట్ల జాగ్రత్త చూపడం వంటివి చూస్తే... అతనో పిల్లకాయ మాదిరిగా ఆమెకు కనిపించాడట. అదే మాటను షూటింగ్ యూనిట్ సభ్యులతో చెప్పేసిందట.

సభ్యుల్లో ఒకతను ఆ మాటను తీసుకెళ్లి నేరుగా కరీనాతో చెప్పేశాడట. మరి కరీనా దీపికను ఏమంటుందో ఏమో...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT