కరీనా... రాక్షస వివాహానికైనా రెడీ
సైఫ్ అలీతో త్వరలో పెళ్లి అంటూ ఆరాటంగా చెప్పే కరీనాకపూర్ కొత్తగా పెండ్లి కూతురు అవతారమెత్తింది. సైఫ్‌తో పెళ్లి వార్త లేకుండా ఈ అవతారం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నారా..? అక్కడకే వస్తున్నాం...
తన స్నేహితురాలు అమృతా అరోరా తన వివాహం సందర్భంగా పెండ్లి కూతురు అలంకరణలు తన గదిలో తెచ్చి పెట్టుకుందట. ఆమె వద్దకు వెళ్లిన కరీనా ఆ అలంకరణలన్నిటినీ ధరించేసిందట. అది చూసిన అమృత షాకైపోయిందట.
లోలోన ఏమనుకుందో తెలియదుగానీ... బయటకు మాత్రం కరీనాను దేవకన్యలా ఉన్నావని పొగడ్తల వర్షం కురిపించిదట. అంతేకాదండోయ్... తను మగాణ్ణయితే ఇప్పటికిప్పుడే రాక్షస వివాహం చేసుకునేదాన్నని పకపకా నవ్వుతూ చెప్పిందట.
అదే మాటను సైఫ్ అలీ అంటే ఎంతో బావుణ్ణో అని కరీనా గుసగుసగా చెపుతుంటే ప్రక్కనే ఉన్న ఓ స్నేహితురాలు వినేసిందట. వింటే ఊరుకుంటుందా మరీ.... ఆడవాళ్ల నోట్లో ఆవగింజైనా దాగదన్నట్లు.. ఊరూ వాడా ఏకం చేయదూ...