1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

బాలయ్య కొత్త చిత్రం "మిత్రుడు"..?

వినోదం వెండితెర గుసగుసలు బాలయ్య కొత్త చిత్రం మిత్రుడు ఆదిత్య 369 వంశానికొక్కడు భలేవాడివి బాసూ శివలెంకప్రసాద్ ప్రియమణి
ఆదిత్య 369, వంశానికొక్కడు, భలేవాడివి బాసూ వంటి చిత్రాలను నిర్మించిన శివలెంకప్రసాద్ బాలకృష్ణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 28వరకు జరిగే షెడ్యూల్తో టాకీ పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రానికి "మిత్రుడు" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నారు. ఆడియోను మార్చిలోనూ, సినిమాను ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.
About Writer
SELVI.M