1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. అమృతకు బకరా.. బాయ్‌ఫ్రెండ్ కావాలట

అమృతకు బకరా.. బాయ్‌ఫ్రెండ్ కావాలట

మహేశ్ బాబు షాహిద్ ప్రియాంకా చోప్రా కరీనా అమృతా రావు
"అతిథి"లో తన గ్లామర్‌తో అలరించిన అమృతకు దోస్త్ మేరా దోస్త్ అని రాసుకు పూసుకు తిరగడం అలవాటట. ఏదైనా ఒక్క చిత్రంలో నటిస్తే చాలు.... నటించినంత కాలం సదరు హీరోతో పొద్దస్తమానం కబుర్లు చెప్పడానికి వెంటపడుతుందట.

ఆ మధ్య మహేష్ బాబుతో నటించిన అతిథి చిత్రం సమయంలోనూ ఇదే వరుస సాగిందట. పొద్దస్తమానం మహేశ్‌కు ఫోన్లు చేసి అదీ... ఇదీ అంటూ ఏదేదో మాట్లాడేదట. దీంతో చిర్రెత్తిన నమ్రత... అమృతా నీ సణుగుడు ఆపి... మళ్లీ ఈ నెంబరుకు ఫోన్ చేయకు అనేంతవరకూ రావడంతో అమృత తనంతట తానే మానుకుందట.

ఆ తర్వాత ఫోను మిత్రుడు లేక తహతహలాడిన అమృతకు వివాహ్ హీరో షాహిద్ చిక్కాడట. అక్కడా ఇదేవిధంగా సన్నిహితంగా ఉండటంతో షాహిద్‌ను అతని గాళ్‌ఫ్రెండ్ ఛీ కొట్టిందట. ఈ పరిణామంతో బిత్తరపోయిన షాహిద్ తన సిమ్ కార్డును మార్చేసి జారుకున్నాడట.

అయినా వదులుతుందా ఏంటీ... తాజాగా ప్రియాంక బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. ఇక్కడా ఇదే రకమైన బిహేవియర్. షూటింగ్‌ల వరకే కాక, అతగాడిని పబ్‌లకు వెంటేసుకుని వెళుతుందట. ఇది చూసిన ప్రియాంక తోకతొక్కిన పామైందట. నేరుగా బాయ్‌ ఫ్రెండ్‌ని కలిసి అమృతకు దూరమైతేనే నేను నీకు దగ్గరవుతాను అని చెప్పిందట. చెసేది లేక అతడూ చల్లగా జారుకున్నాడట. ఇక ఇప్పుడు మరో బకరా కోసం అమృత వెతుకుతోందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT