మంగళూరు పబ్‌లకెళ్లాలంటే భయమేస్తుందట
దీపికా పదుకునే పెద్ద తిండిబోతట. చేపలు, పీతలు, రొయ్యలు... ఇలా వరుసగా అన్ని మాంసాహార పదార్థాలను తినడం మొదలుపెట్టిందంటే చూసిన వారు ఆశ్చర్యపోవాల్సిందేనట. దీపికకు ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలలో తయారయ్యే భోజన పదార్థాలంటే నోరూరుతుందట.
ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే... హైదరాబాదీ బిర్యానీ తినకుండా వెళ్లదట. ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడితే ముందుగానే బిర్యానీకి ఆర్డర్ చెప్పి బిర్యానీ పొట్లాన్ని తన అసిస్టెంటు ద్వారా తెప్పించుకుని లొట్టలేసుకుంటూ తినేస్తుందట.
వీటన్నిటికీ మించి మంగళూరులోని కొన్ని పబ్ సెంటర్లలో తయారయ్యే వంటకాలంటే దీపకకు నాలుక పీకుతుందట. మంగళూరులో తయారయ్యే చేపల కూర, రొయ్యల కూర, చేపల వేపుడు, కొలి రోటీలను తినాలని ఎంతో ఆశగా ఉంటుందట.
అయితే రామసేన దాడి సంఘటన తర్వాత అక్కడి పబ్‌లలోకి వెళ్లి తిని రావాలంటే భయమేస్తుందట. అయినా జిహ్వ చాపల్యం వదలకపోవడంతో హైదరాబాదీ బిర్యానీని ఆర్డరిచ్చి తెప్పించుకున్నట్లే... మంగళూరు చేపలవేపుడు, పీతల కూర, రొయ్యల కూర... వగైరా.. వగైరాలన్నిటినీ ఓ పార్సిల్‌లో తెప్పించుకుని ఎంచక్కా ఇంట్లో కూచుని కడుపారా తింటోందట.