జూనియర్ చిరు సరసన ముమైత్ ఖాన్!
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రంలో జూనియర్ డిస్కోశాంతిగా పేరుగాంచిన ముమైత్ ఖాన్ నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్న ఒక పాటకోసం ముమైత్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రామ్ చరణ్ పేరు ఖరారు చేయని ("మగధీర"గా నామకరణం చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం) చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి గతంలో నటించిన "ఘరానా మొగుడు" చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట' అనే పాటను పెడుతున్నారు. ఈ పాటలో చరణ్‌తో పాటు మెగాస్టార్ కూడా స్టెప్పులు వేయనున్న విషయం తెల్సిందే. కాగా, పాటలో చిరంజీవి సరసన డిస్కోశాంతి నర్తించింది. ప్రస్తుతం ఆ పాత్రను ముమైత్ ఖాన్‌ను ఎంపిక చేయగా, రామ్ చరణ్‌తో చిందులు వేయనుంది.