సొంతంగా గుడి కట్టించుకున్న నయనతార!
సాధారణంగా సినీ నటులకు అభిమానులు గుడులు కట్టించి పూజలు చేస్తుంటారు. ఈ కోవలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ, తెలుగు నటి ఖుష్బూకు అభిమానులు స్వయంగా ఆలయాలు నిర్మించి పూజలు చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తాజాగా నయనతార సొంతంగా గుడి కట్టించుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.
జోతిష్యంపై బాగా నమ్మకం ఉండే నయన తారకు, జోతిష్య నిపుణుల సూచన మేరకు తమిళనాడులోని ఒక మారు మూల గ్రామంలో తన సొంత డబ్బుతో గుడి కట్టించి, దాన్ని అభిమానులు కట్టించినట్టుగా ప్రచారం చేస్తోందట.
ఆమెకు ఏదో దోషం ఉందని, దీన్ని పోగొట్టుకునేందుకే ఇలా చేయమని జోతిష్కులు చెప్పినట్టు కోడంబాక్కం వర్గాల సమాచారం. ఇటీవలి కాలంలో ఛాన్స్‌లు మిస్ అవడం, నిర్మాతల మండలి నుంచి బహిష్కరించబడటం వంటి చాలా కష్టాలు పడుతున్న నయనతార.. వీటి నుంచి గట్టెక్కేందుకే ఇలా దొంగ చాటు పనులు చేస్తున్నట్టు కోడంబాక్కం ఫిలిమ్ నగర్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.