1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. పొట్టి గౌనుతో ప్రియాంక తంటా

పొట్టి గౌనుతో ప్రియాంక తంటా

ప్రియాంకా చోప్రా పొట్టి గౌను కురుచ దుస్తులు మహిళ
సినిమాల్లో టూ పీస్ డ్రెస్సులేసుకుని హీరో వెంబడి గెంతే హీరోయిన్లను చూసి ప్రేక్షకులు ఏదో ఆ కాసేపు భరిస్తారు కానీ, పార్టీలకు, ఫంక్షన్లకు సైతం ఇదే రకమైన డ్రెస్సులేసుకొస్తే జనం చూపులు పార్టీపై లఘ్నం కావడం కష్టమే కదా. అయినా ఈ టూపీస్ హీరోయిన్లకు ఇదేమీ పట్టదు. ఎవరో ఒకరు పంటికింద రాయిలా తగిలితే అప్పుడు మొదలవుతాయి వీరి టూ పీస్ దుస్తుల కష్టాలు. ప్రియాంకా చోప్రాకు ఇటువంటి చేదు అనుభవం ఒకటి ఎదురైందట.

మొన్నామధ్య ప్రియాంకా చోప్రా, కరీనాకపూర్ ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్‌కి వెళ్లారట. ఆ పార్టీకి భారతీయ సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటించే ఓ మహిళామణి కూడా వచ్చిందట.

కరీనా, ప్రియాంకలిద్దరూ సదరు మహిళను విష్ చేయగా... కరీనాతో మాత్రమే ప్రేమపూర్వకంగా పలుకరించి, ప్రియాంకను మాత్రం ఎగాదిగా చూసిందట ఆ మహిళ. అంతటితో వదలక... ఏమ్మా, జరిగే పార్టీ ఏంటీ, నువ్వేసుకొచ్చిన డ్రెస్సేంటి. సినిమాల్లో మాదిరిగా ఇక్కడకు వస్తే జనం నవ్వి పోరూ... అని దీర్ఘం తీసిందట.

ఈ పరిణామంతో బిక్కచచ్చిన ప్రియాంకా... వేసుకొచ్చిన పొట్టి దుస్తులనే కాళ్ల దాకా లాగి... లాగి ఓ కుర్చీలో కూలబడిందట. ప్రియాంక దురదృష్టం కాకపోతే... ఆ ప్రక్క కుర్చీలోనే సంప్రదాయ మహిళా వచ్చి కూచుందట. కూచున్నది కాక మధ్యమధ్యలో ఆమెవంక, ఆమె వేసుకొచ్చిన డ్రెస్సు వంక కొరకొర చూస్తూనే ఉందట.

ఆ చూపులను తట్టుకోలేని ప్రియాంక... పొట్టి దుస్తులను కాళ్ల దాకా లాగీ... లాగీ సాగదీసిందట. వేసుకొచ్చిన పొట్టి గౌను కాస్తా ప్రియాంక లాగుడు దెబ్బకు మోకాళ్ల కింది దాకా జారి పొడవు గౌనుగా మారిపోయిందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT