ఇండస్ట్రీలో ఇందరుండగా "అరగుండుకు" పద్మ అవార్డా..?
|
ఈ కారణంతో షూటింగ్‌లో హింసించడం బ్రహ్మానందానికి అలవాటై పోయిందట. చిన్న నిర్మాతలనైతే మరింత కాల్చుక తింటాడట. చాలామంది ఇ.వి.వి దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకునేవారట. షూటింగ్‌కు సరైన సమయానికి రాకపోవడం, టిఫిన్లు, భోజనాలు కూడా ఇంటికి పట్టుకెళ్లడం వంటివన్నీ చేస్తున్నాడని తెగ బాధపడిపోయారట. ఇవివి సైతం, అవునయ్యా బాబూ... నేనూ "తొట్టి గ్యాంగ్" ముందు వరకూ అతని ప్రవర్తనతో చాలా బాధపడ్డానని చెప్పాడట. లేడీ ఆర్టిస్టులను రికమెండ్ చేయడం, ఇతర విషయాల్లో జోక్యం చేసుకుని హేళన చేయడం లాంటివి చేసేవాడని అన్నాడట.
బ్రహ్మానందంతో వేగలేక తన చిత్రాల్లో అవకాశాలు ఇవ్వడం మానేశానని చెప్పుకొచ్చాడట. ఇదిలా ఉంటే, తాజాగా బ్రహ్మానందానికి "పద్మ" అవార్డు వస్తే అందరూ ఆయనను అభినందించారు. కానీ ఇవివి మాత్రం.... ఎంతో మంది సీనియర్లుండగా అరగుండుకు అవార్డు రావడం ఇండస్ట్రీ ఖర్మ అని వ్యాఖ్యానించాడట.
ఆల్రెడీ... సి.సి. రెడ్డి చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు బ్రహ్మానందం నటిస్తున్నారు. కనుక అక్కడే సీఎంను బాగా కాకా పట్టి ఉంటాడని కొందరి సినీ జనాల మాట.
