1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఇక మయూరీగా.. ఆషాశైనీ..!

వినోదం వెండితెర గుసగుసలు మయూరీ ఆషాశైనీ తెలుగు తమిళం హిందీ ఐటంసాంగ్ గ్లామర్ రోల్స్
తెలుగు, హిందీ, తమిళభాషల్లో తన అందచందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ ఆషాశైనీ.. తన పేరును మయూరిగా మార్చుకుందట. గతంలో జరిగిన సంఘటనలే తన పేరు మార్చుకోవడానికి ప్రధాన కారణమని మయూరీ అంటోంది.

గతంలో పాస్‌పోర్ట్ కుంభకోణంలో వ్యవహారంలో ఎదుర్కొన్న ఆరోపణలను పీడకలగా భావిస్తున్నానని, తనను అన్యాయంగా ఇరికించారని ఈ అందాల సుందరి చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. జోతిష్యం ప్రకారం మయూరిగా పేరు మార్చుకున్నానని, తెలుగులో "ఇ ఇంటిలో" అనే చిత్రంలో నటిస్తున్నానని మయూరి వెల్లడించింది.

"పాండవులు" అనే సినిమాలో నటించడం లేదని, తన నుంచి పూర్తి అంగీకారం పొందకనే పేరు వేశారని ఆషాశైనీ తెలిపింది. తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తున్నారని, ఇకపై గ్లామర్‌ రోల్స్ పోషిస్తానని, కథకు అనుకూలంగా ఉంటే ఐటంసాంగ్‌కూడా చేస్తానని మయూరి చెప్పుకొచ్చింది.

ఇకపోతే.. ఇంతవరకు తనకు ఎవ్వరూ నెగటివ్ పాత్రలు ఇవ్వలేదని, ఇస్తే తప్పకుండా చేస్తానని ఆమె పేర్కొంది. ఉత్తరాది కంటే దక్షిణాదిలో క్రమశిక్షణ ఉంటుందని, అంకితభావంతో పనిచేస్తారని మయూరి కితాబిచ్చింది.