"లాల్లిపప్" భావన స్కిన్ షో
|
ట్వంటీ-20లో తాను మోడ్రన్ దుస్తులు ధరించడంపై కొందరు విమర్శలు చేయడం తన దృష్టికి వచ్చిందంటోంది. అయితే విదేశాలలో ఉన్న అమ్మాయి వోణీ, పరికిణీలలో ఎలా ఉంటుందో వారు అర్థం చేసుకోవాలని వయ్యారాలు పోతూ చెపుతోంది. అక్కడి పరిస్థితులకు తగ్గట్లు తన వేషం కూడా మారిందంటోంది.
ఈత కొడుతూ ఈత దుస్తులు ఎలా వేసుకుంటారో ఇదీనూ... అని దీర్ఘం తీస్తోంది. కనుక సందర్భానుసారంగా దుస్తులను ధరించడానికి ఒప్పుకుంటానని చెప్పింది కనుక... ఎక్స్‌పోజింగ్‌కు సిద్థమన్నట్లేనని కొందరు నిర్మాతలు భావనను తమ తదుపరి చిత్రాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.
అన్నట్లు తాజాగా హీరో శ్రీకాంత్ 100వ చిత్రం మహాత్మ చిత్రంలో భావన నటిస్తోంది. తనకు ఆ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతోంది.
