ఛార్మీస్ లవ్ డైరీలో దేవీశ్రీప్రసాద్
ఛార్మీ, దేవీశ్రీ ప్రసాద్‌లను ప్రేమదోమ కుట్టిందని టాలీవుడ్ సినీజనం ఒకటే చెప్పుకుంటున్నారు. నటి ఛార్మి, దేవీలిద్దరూ ఆ మధ్య పబ్‌ల్లో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని గుసగుసలు సైతం వినిపించాయి. అయితే దేవీశ్రీ దానిని ఖండించి "మేమిద్దరం మంచి మిత్రులం..." అంటూ లేత ప్రేమికులు చెప్పే డైలాగులు చెప్పేశాడు. అయితే మిత్రులైనవారు ప్రేమికులు కాకూడదనే రూలేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు కొందరు టాలీవుడ్ సినీ జనం. ఇదీ నిజమే కదా...
దీనికితోడు వీరిద్దరూ కలిసి సై ఆట అనే చిత్రంలో నటిస్తున్నట్లు విశ్వసనీయ సమచారం. గతంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర నిర్మాత పత్రికా ప్రకటన కూడా ఇచ్చాడు. కానీ అది నిజం కాదనీ, దేవిశ్రీ ఖండించాడు. అయితే ఈ చిత్రంలో దేవీశ్రీ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో అందరికీ తెలిసిన ఓ నటుడికి ప్యారడీగా దేవిశ్రీ పాత్ర ఉంటుందట. ఇందులో శ్రీ 25 నిమిషాలు నటించాడనీ, ఛార్మి నటనకు మించిన నటనా ప్రతిభను ప్రదర్శించాడనీ భోగట్టా. మరి ఈ చిత్రం విడుదల తర్వాత కాని తెలియదు... అసలు సంగతి.