సినిమా రిచ్.. కానీ ప్రొడ్యూసర్ పూర్..!
శివాజీ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్". ఈ సినిమా తీసి పాపం.. ప్రొడ్యూసర్ కుమారస్వామి రోడ్డున పడ్డాడట. రియల్ ఎస్టెట్ రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన స్వామి, ఉన్న ధనమంతా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు.
హీరో శివాజీ అధిక పారితోషికం పుచ్చుకోవడంతో పాటు, హీరోయిన్ కావేరిఝా కూడా పారితోషికం ఎక్కువ ఇప్పించాడు. పైగా ప్యారిస్‌లో సినిమా షూటింగ్ కోసం వెళ్లి అక్కడే 8 రోజులు కావేరీఝాతో శివాజీ మకాం వేశాడట. ఆ ఖర్చంతా కూడా కుమారస్వామి నెత్తిమీదే పడిందట. దీంతో ఈ సినిమాకు భారీ మొత్తం ఖర్చైందని సినీ యూనిట్ గుసగుసలాడుకుంటోంది.
అందుకే సినిమా పూర్తయినా విడుదల వాయిదా పడుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. చివరికి పబ్లిసిటీ ఖర్చులు కూడా లేకపొవడంతో శివాజీని అడిగితే చేయివిరిచేశాడట.
మొత్తానికి చేసేదేమీ లేక కుమారస్వామి ఫెనాన్స్ మీద అధిక వడ్డీకి రుణం తీసుకుని వచ్చేనెల (మార్చి) 6వ తేదీన "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్" సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడట. సినిమా రిలీజ్‌కు నైజాం ఏరియాను ఎంచుకున్నాడట. అందుకే అన్నారు మన పెద్దలు "కష్టం ఒకరిది... ఫలితం మరొకరిదని..!"