1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"రావణ"కోసం ఓ పార్కులో ఐశ్వర్యారాయ్

రావణ ఐశ్వర్యారాయ్ అభిషేక్ మణిరత్నం విక్రమ్
PTI
మాజీ ప్రపంచ సుందరి పద్మశ్రీ ఐశ్వర్యారాయ్ మణిరత్నం చిత్రం రావణ షూటింగ్‌తో మహా బిజీ ఉంది. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను కోలకతాలోని కొన్ని అందమైన ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత రజనీ సరసన "ఎందిరన్" చిత్రంలో చేయాల్సి ఉంది.

రావణ చిత్రం కోసం ఐశ్వర్యారాయ్ పూర్తిగా ఇంటికి దూరంగా గడుపుతోంది. రావణుని పాత్రలో నటిస్తున్న అభిషేక్ బచ్చన్ మాత్రం షూటింగ్ సమయాల్లో ముంబయి నుంచి షూటింగ్ లొకేషన్లకు నేరుగా వస్తున్నాడట. ఈ చిత్రం ముగిసిన తర్వాత కూడా ఐశ్వర్య ముంబయికి వచ్చే సూచనలు లేకపోవడంతో ఇద్దరూ కలిసి వచ్చే మార్చి నెలలో లేదా ఏప్రిల్ నెలలో చిన్న సైజు విహారానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారట.

మరి రూ.6 కోట్ల పారితోషికాన్ని అందించిన శంకర్ ఆమె విదేశీ పయనానికి ఊ... అంటాడో లేదో చూడాలి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT