1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఆయనతో నటించడం ఓ పీడకల..!

వినోదం వెండితెర గుసగుసలు పీడకల రాజశేఖర్ సత్యమేవజయతే నీతూచంద్ర మాధవన్ ప్రివ్యూ జీవిత
WD
తాను రాజశేఖర్‌తో కలిసి నటించడం ఓ పీడకలగా భావిస్తున్నానని "సత్యమేవజయతే" హీరోయిన్ నీతూచంద్ర అంటోంది. రాజశేఖర్ ఉదంతాన్ని తన లాయర్స్ చూసుకుంటున్నారని, అన్నింటికి వారే సరైన సమాధానం చెబుతారని ఆమె వెల్లడించింది. "సత్యమేవజయతే" చిత్రం షూటింగ్‌లో నీతూచంద్రను రాజశేఖర్ బూతులు తిట్టడమేగాక, ఇకపై దక్షిణాది చిత్రాల్లో నటించకుండా చేస్తానని బెదిరించిన విషయం తెలిసిందే.

తాజాగా నీతూచంద్ర మాధవన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో మాధవన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. సహచరి నటితో ఎలా నడుచుకోవాలో ఆయనకు బాగా తెలుసునని, అందర్నీ మాధవన్ గౌరవిస్తారని పేర్కొంది. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి గనుకనే ఇంతటి ఉన్నతి స్థితికి చేరాడని నీతూచంద్ర అంటోంది. అవకాశమొస్తో ఆయనతో మళ్ళీ నటిస్తానని ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. "సత్యమేవజయతే" చిత్రం ప్రివ్యూ విడుదలైన రెండు వారాల తర్వాత కొద్దిమందికి ప్రదర్శించడానికి ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం రాత్రి సన్నాహాలు చేశారు. కానీ ఎవ్వరూ రాకపోవడంతో.. చేసేదేమీ లేక జీవితా, రాజశేఖర్ వెనుదిరగడం చర్చనీయాంశమైంది.
About Writer
SELVI.M