1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. అరుంధతి అనుష్కతో యుగంధర్ ప్రభాస్ లవ్.. కావ్... కావ్

అరుంధతి అనుష్కతో యుగంధర్ ప్రభాస్ లవ్.. కావ్... కావ్

అనుష్క ప్రేమాయణం యుగంధర్ ప్రభాస్ ప్రేమ గుసగుసలు
మగాళ్లకే మగాళ్లను సైతం ముచ్చెమటలు పట్టించే అరుంధతి క్యారెక్టర్‌లో నటించి అందరి చేత శహభాష్ అనిపించుకున్న అనుష్క ప్రేమాయణం వార్తలతో మళ్లీ టాలీవుడ్ వేడెక్కింది. ఆరడగులు ఆజానుబాహుడు ప్రభాస్‌తో పబ్‌లు, పార్టీలంటూ అనుష్క చెక్కెర్లు కొడుతోందని ఫిలిమ్ నగర్‌ "కావ్... కావ్..." అంటూ గుసగుసలాడుతున్నాయి.

ఇది నిజమో కాదో కానీ, ప్రభాస్ మాత్రం తన యుగంధర్ చిత్రంలో అనుష్కనే బుక్ చేయాలని మంకు పట్టు పట్టాడంటున్నారు. దీంతో దర్శక నిర్మాతలు ప్రభాస్ కోరిక మేరకే అనుష్కను యుగంధర్‌లో నటింపజేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే... ఆ మధ్య సెంథిల్ అనే కెమేరామేన్‌తో అనుష్క ప్రేమలో పడిందన్న వార్తలను మహా సీరియస్‌గా తీసుకున్న యోగా టీచర్ అనుష్క... తనకూ, సెంథిల్‌కు నడుమ అటువంటిదేమి లేదని చెప్పేసింది. ఎవరో తిక్క మనుషులు ఇటువంటి రూమర్లు పుట్టించారని మండి పడింది. మరి ఇప్పుడు యుగంధర్ ప్రభాస్‌పై ఏమి చెపుతుందో ఈ సెక్సీ అందాల అరుంధతి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT