"వినాయకుడు" పూనమ్‌కు పొడవు సమస్యట...
|
ఈ మాట ఆమెకు చేరిందో లేదోగానీ, తన ఫిజిక్‌పై ప్రత్యేక దృష్టి సారించి మరి కాస్త పొడవు పెరిగేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోదట. జిమ్‌లు వర్కవుట్లతో మహా బిజీగా బిజీగా గడుపుతోందట. సమయం దొరికినప్పుడల్లా స్విమ్మింగ్ సైతం చేస్తోందట.
అన్నట్లు ఈ భామ హైటెక్ హైదరాబాదులో జరిగే ప్రామినెంట్ ఫంక్షన్లకన్నింటికీ హాజరవుతూ అందరి కళ్లలో పడటానికి ప్రయత్నిస్తోందట. ఈ ప్రయత్నాలన్నీ వర్కవుట్లు ముగించిన తర్వాత చేస్తే బావుంటుందేమో అని కొందరు సినీ జనం గొణుగుతున్నారట. ఏదేమైనా వినాయకుడుతో మంచి పేరు తెచ్చుకున్న పూనమ్ టాలీవుడ్ రేసులో అగ్రస్థానాన నిలవలాని మనమూ కోరుకుందాం...
