1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. బాత్ టబ్ సన్నివేశాలతో రస్నాబేబీ "సునామీ"

బాత్ టబ్ సన్నివేశాలతో రస్నాబేబీ "సునామీ"

సునామీ అంకిత సెక్సీ బేబీ బాత్ టబ్ సన్నివేశాలు ప్రియమణి బికినీ
"ఐ లవ్యూ రస్నా.." అంటూ బుల్లితెరపై బుల్లి బుల్లి పలుకులతో పరిచయమైన రస్నా బేబీ అంకిత "సునామీ" చిత్రం రూపంలో తెలుగు వెండితెరపై విరుచుకుపడనుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు సునామీలో తన అందాలను కనువిందు చేయడానికి సిద్ధమైంది.

ఈ రస్నాబేబి సునామీలో ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేసినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. గ్లామర్ పరిశ్రమలో ఇదంతా మామూలే అని చెప్పే అంకిత సునామీకోసం ఇటీవల బాత్ టబ్ సన్నివేశాలలో నటించిందట.

మొన్నామధ్య బాలకృష్ణ చిత్రం కోసం ప్రియమణి బికినీ వేసుకుని టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపితే... అందాల అంకిత బాత్ టబ్ సన్నివేశాలలో నటించి కుర్రాళ్ల గుండెల్లో సునామీ రేపుతోంది. ఇక ఈ చిత్రం విడుదలైతే టీనేజ్ కుర్రాళ్లందరూ "ఐ లవ్యూ రస్నా" అంటారేమో.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT