1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఫిలింసిటీలో "రోబో" సాంగ్..!?

వినోదం వెండితెర గుసగుసలు ఫిలింసిటి రోబో సాంగ్ రజనీ కాంత్ ఐశ్వర్యారాయ్ శంకర్ దయానిధి మారన్ సన్ పిక్చర్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ కాంబినేషన్‌లో వస్తోన్న "రోబో" చిత్రం ఇప్పటికే క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో దయానిధిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సన్‌పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాకు సంబంధించిన.. తాజా షెడ్యూల్ ఈ నెల 6 నుంచి 16 వరకు ఫిలింసిటిలో జరుగనున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. రాజు సుందరం దర్శకత్వం వహిస్తున్న ఆ పాటను రజనీకాంత్, ఐశ్వర్యారాయ్‌పై చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలిసింది.
About Writer
SELVI.M